Category: Poems(Telugu)

  • మధురస్మృతులు

    మధురస్మృతులు

    ఈ నిశీధిలో…. ఏదో తెలియని మైకంలో … ఆలోచిస్తూ నిలుచున్నా… చుట్టూ ఉన్న వృక్షాలు.. మెరిసే ఆ ఋక్షాలు.. మనసుని తాకెను ఓ పవనం… ఎదలో వెలిగెను ఓ అరుణం.. ఆగెను కాలం ఓ క్షణం… ఏవో స్మృతులు …ఏవో కథలు … మనసును మీటిన మధుర భావనలు లాలిపాటలు… గోరుముద్దలు.. వేసిన అడుగులు తీసిన పరుగులు.. బాల్యం యేటిలో ఈదిన ఈతలు.. గోలలు….గొడవలు.. వాన నీటిలో పేపరు పడవలు గోలీలాటలు..దాగుడు మూతలు మా ఊరి మాస్టారు

    Read More

    //

  • ఎండమావి…

    ఎండమావి…

    నే పాడని ఈ రాగం నే రాయని ఈ గీతం చరణం, పల్లవి, తాళం లేవు… గుండెల్లో సరాగం తెలియదు గమ్యం తెలియని పయనం దారే దొరకని తీరం……. ఎండమావులు ఎడారి దాటుతూ దాటుతూ – దాగుతూ మార్గం వెతుకుతూ ఊటలేని బాటలు నడుస్తూ నిస్సత్తువ నిండుతూ ఉంటే… అడుగేయగలవా…! అని ప్రశ్నిస్తూవుంటే గెలుపంటేనే తెలియని గమనం ఓటమికీ భయపడుతుందా –! ఆగిపోయి మనగలుగుతుందా..! ఓ వేసవి ….ఓ వేకువ ఓ వేకువ…. ఓ జాము ఆ

    Read More

    //

  • # నేలతల్లి

    # నేలతల్లి

    #నేలతల్లి కిలకిలమని  పలుకులలో.. సెలయేళ్ళ  పరువళ్ళలో.. చిన్నారుల  చిరునవ్వులలో.. పులకించిన భావరాగం.. మేఘాలై సాగంగా… అనురాగం  ఆప్యాయతచల్లగాలై  వీచంగా… చినుకులన్ని   చిగురించి.. తన్మయత్వంతో    తాళం వేయగా.. లయలోన   జత కలిపి.. లాస్యమాడెను  నేలతల్లి…. (28-08-2019)

    Read More

    //

  • # సిలకమ్మ

    # సిలకమ్మ

    సిలకమ్మ సిలకమ్మ పలుకుల్లోని మధురాల వీణవోలే మొయిలు దోనెల మీద  విహరించు తారకావోలే వినిపించే నీ పలుకు  కడురాతిని తాకే  చల్లని ఓ చినుకు నీలి నింగి తారల్లో పరవశించే పండు వెన్నెలలా అలరారే ఆ నవ్వు విరబూసిన  వసంతం నువ్వు….. (08-05-2021)

    Read More

    //

  • #సమీరం

    #సమీరం

    సమీరం పుడమిని స్ప్రుశించి, నదీనదాలు అడవులు, కొండలు, కోనలు మీటి సెలయేరున తడిసి… సమస్త ప్రాణికి జీవమై…. కోకిల స్వరమున రాగమై…. గగన వీధిలో ప్రయాణిస్తున్నా….. దావాగ్నిలో జ్వలిస్తున్నా…. దానికి శిఖరం ఒక్కటె..శిథిలం ఒక్కటె.. నేల ఒక్కటె….లోయ ఒక్కటె తిమిరం ఒక్కటె….కాంతీ ఒక్కటె.. ధనవంతుడు ఒక్కటె…దరిద్రుడు ఒక్కటె.. దానికి రంగూ…రూపూ లేనే లేదు జాతి…మతం ఏమో తెలియవు.. స్వేచ్ఛా..జీవం దాని నైజాలు అస్ప్రుశ్యత అసలే యెరుగదు.. జీవన కారకమై……… అమృత రసమారుతమై….. ఈ    మురళిని చేరి….

    Read More

    //