ఈ నిశీధిలో….
ఏదో తెలియని మైకంలో …
ఆలోచిస్తూ నిలుచున్నా…
చుట్టూ ఉన్న వృక్షాలు..
మెరిసే ఆ ఋక్షాలు..
మనసుని తాకెను ఓ పవనం…
ఎదలో వెలిగెను ఓ అరుణం..
ఆగెను కాలం ఓ క్షణం…
ఏవో స్మృతులు …ఏవో కథలు …
మనసును మీటిన మధుర భావనలు
లాలిపాటలు… గోరుముద్దలు..
వేసిన అడుగులు తీసిన పరుగులు..
బాల్యం యేటిలో ఈదిన ఈతలు..
గోలలు….గొడవలు..
వాన నీటిలో పేపరు పడవలు
గోలీలాటలు..దాగుడు మూతలు
మా ఊరి మాస్టారు పెట్టిన వాతలు
స్కూలు తర్వాత ఉడుత షికారు..
నాన్నొచాడంటే….ఎటో పరారు
చినిగిన చొక్కా…..చిన్న నెక్కరు….
పలక ..బలపం..ఓ నోటుపుస్తకం
అమ్మ ఇచ్చే అర్థ రూపాయి
పట్టిన కుస్తీ….చేసిన దోస్తీ…
జెండా వందనానికి చేసే ఇస్త్రీ…
చిలిపి చేష్టలు…చిందులు… చీవాట్లు..
ఆటలు….పాటలు… మాట ముచ్చట్లు
ఎద లోతుల్లో చెరగని స్మృతులు…
ఇప్పుడు స్వప్నాల తీరంలో కలల సాగులు..
నీటిలో నవలా…పేరుపై గాలిలా …
అలలా సాగెను ఆ నిమిషం….






Leave a Reply