సమీరం
పుడమిని స్ప్రుశించి, నదీనదాలు
అడవులు, కొండలు, కోనలు మీటి
సెలయేరున తడిసి…
సమస్త ప్రాణికి జీవమై….
కోకిల స్వరమున రాగమై….
గగన వీధిలో ప్రయాణిస్తున్నా…..
దావాగ్నిలో జ్వలిస్తున్నా….
దానికి శిఖరం ఒక్కటె..శిథిలం ఒక్కటె..
నేల ఒక్కటె….లోయ ఒక్కటె
తిమిరం ఒక్కటె….కాంతీ ఒక్కటె..
ధనవంతుడు ఒక్కటె…దరిద్రుడు ఒక్కటె..
దానికి రంగూ…రూపూ లేనే లేదు
జాతి…మతం ఏమో తెలియవు..
స్వేచ్ఛా..జీవం దాని నైజాలు
అస్ప్రుశ్యత అసలే యెరుగదు..
జీవన కారకమై………
అమృత రసమారుతమై…..
ఈ మురళిని చేరి….
సుస్వర మధుర గీతికమై…..
ఈ ప్రకృతి ఒడిన వికసించే….
ప్రాణం…. ప్రణవం….జీవం…..
రాగం………….ఈ సమీరం
(27/11/2020)






Leave a Reply