నే పాడని ఈ రాగం
నే రాయని ఈ గీతం
చరణం, పల్లవి, తాళం లేవు…
గుండెల్లో సరాగం తెలియదు
గమ్యం తెలియని పయనం
దారే దొరకని తీరం…….
ఎండమావులు ఎడారి దాటుతూ
దాటుతూ – దాగుతూ మార్గం వెతుకుతూ
ఊటలేని బాటలు నడుస్తూ
నిస్సత్తువ నిండుతూ ఉంటే…
అడుగేయగలవా…! అని ప్రశ్నిస్తూవుంటే
గెలుపంటేనే తెలియని గమనం
ఓటమికీ భయపడుతుందా –!
ఆగిపోయి మనగలుగుతుందా..!
ఓ వేసవి ….ఓ వేకువ
ఓ వేకువ…. ఓ జాము
ఆ వెన్నెల ఈ కన్నుల కలలను దాటి చేరేదెన్నడో..
నిండు మబ్బుల నిశీధి రాత్రిలో
వసంతకాంతులు పూచేదెప్పుడో …!
~14/03/2025






Leave a Reply to Rakeshkanikaram Cancel reply